క్రైస్తవ ప్రగతి మరియు హక్కుల, ఆస్తుల పరిరక్షణ సమాఖ్య

ఒకే ఒక్క లోక రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు నందు పరిశుద్ద పరచబడుతున్న ప్రియులకు వందనములు !!!

ఈ లోకంలో సర్వమానవులు పరిశుద్దుడును, పాపవిమోచకుడైన యేసు క్రీస్తు వారి ప్రేమ, సత్యము, జీవము గల మాటలు విని నమ్మి ప్రభువు చేయుచున్నఅద్భుత సాక్ష్యములు గ్రహించి ప్రభువుకి ప్రార్ధనలు చేసుకోవడం, చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం, క్రైస్తవ మత విశ్వాస ఆచారాలు కొనసాగించడం మరి కొందరైతే మారుమనస్సు అనుభవం ద్వారా రక్షణ బాప్తిస్మం తీసుకోవడం పరిపాటి. ఇలా సత్య సువార్త విని స్త్రీ-పురుష మరియు పేద-ధనిక-కుల-మత అనే బేధం లేకుండా న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, యాక్టర్లు, ఉద్యోగులు, విద్యార్ధులు, కళాకారులు, రైతులు, శ్రామికులు, మావోయిస్టులు, డెకాయిట్స్, రౌడీషీటర్స్, ఇతర మత పెద్దలు, కడకు క్రైస్తవులను హింసించే అనేకమంది ప్రతి రోజు స్వచ్చందంగా దేవుని రాజ్యంలో చేర్చబడి ఆశీర్వదించబడుతున్నారు.

అంతమాత్రమేకాక, కొందరు దేవుని సేవచేయుటకై పిలుపు కలిగి తమ వృత్తులు-వ్యాపారాలు-ఉద్యోగాలు, హోదాలు- పదవులు, ఆస్తులు విడిచిపెట్టి తమ జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేయడం నిత్య వాస్తవ ప్రక్రియ కారణంగా, అనేక చర్చిలు, స్వచ్చంద సామాజిక సేవా సంస్థలు స్థాపించబడట ద్వారా దేశంలో ప్రజలు పలు విధాలుగా దీవించబడి అభివృద్ధి చెందడం కొనసాగుతున్న చరిత్ర.

నేడు ప్రతి క్రైస్తవుడూ అనగా SC, ST, BC, మరియు OC సామాజిక వర్గాలనుండి ప్రభువైన యేసు క్రీస్తు నందు పాప క్షమాపణ పొంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది సంఘ నిభందనలు అనుసరిస్తూ / కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు అ యా కారణాలు వలన చట్టపరమైన క్రైస్తవ గుర్తింపు లేకపోవడం వలన క్రైస్తవ సమాజానికి పలు విధాలుగా విఘాతం కలుగుతుంది. కనుక ప్రతి క్రైస్తవుడు విధిగా స్వచ్చంద డిక్లరేషన్ పత్రం లేదా నోటరైజెడ్ అఫిడవిట్ ప్రభుత్వానికి సమర్పించి క్రిస్టియన్ మైనారిటీ స్టేటస్ పత్రం / దళిత క్రిస్టియన్ కమ్యూనిటి / అదర్ క్రిస్టియన్ కమ్యూనిటి సర్టిఫికేట్ పొందుటకు ఏపి క్రిస్టియన్స్ సొసైటి వారు క్రైస్తవ సమాజ సేవ చేయాలని ప్రభువు కృపలో భారం కలిగి ఈ క్రింది ప్రాధమిక ఆశయాలతో ముందుకు వచ్చింది అని తెలియపరచుకుంటున్నాం.

సర్టిఫైడ్ క్రిస్టియన్స్ ఫోరం

క్రిస్టియన్ సొసైటి ఆశయాలు:

01. ఏ.పి. క్రిస్టియన్ (స్టాట్యుటరీ) బోర్డు.

02 ఏ.పి క్రిస్టియన్ ఆక్ట్

03. ఏ.పి. క్రిస్టియన్ మైనారిటీ దాడుల నిరోదక చట్టం.

04. క్రైస్తవ మైనరీటి పౌరులకు శాశ్వత దృవీకరణ పత్రం.

05. పాస్టర్లకు, చర్చిలకు, స్వచ్చంద సంస్థలకు శాశ్వత దృవీకరణ పత్రం.

06. పాస్టర్స్ మ్యారేజె మ్యారేజె లైసెన్సు మరియు భీమా

07. క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ & కమ్యూనిటీ హాల్స్

08. మైనారిటీలకు ప్రభుత్వ పదవులు మరియు నిధుల కేటాయింపులు.

09. ఏపి క్రిస్టియన్ మైనారిటీ శాఖ & మంత్రి

10. మైనారిటీ కమిషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ విధులు- బాధ్యతలు-పునర్వ్యవస్థీకరణ.

United Christian Forum for Human Rights

Donations

Bank Details
Bank Account Name: AP CHRISTIAN SOCIETY
Bank Account Number: 50200058704595
Bank IFSC: HDFC0004106
Bank Name: HDFC
PAN: AALAA9477D
UPI ID: apchristiansociety@upi